BTS.. ఇండియాలో ఈ పేరు విననివారు చాలా తక్కువమంది ఉంటారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కొరియన్ బ్యాండ్…తమ పాటలతో యువతను ఉర్రూతలూగిస్తోంది.
బ్యాంగ్‌టన్ బాయ్స్ అని పిలువబడే హిప్‌హాప్ గ్రూప్, స్కూల్ లైఫ్, యూత్, లవ్ గురించి పాటలు తెరకెక్కించి పాపులర్ అవుతోంది. భారతదేశంలో తమకంటూ ఫ్యాన్ బేస్ సృష్టించుకుంది. ఏడుగురు సభ్యులున్న ఈ బ్యాండ్ చేసే రచ్చ గురించి తెలుసుకోండి.
బ్యాంగ్ టన్ బాయ్స్ ను క్లుప్తంగా BTS అని పిలుస్తుంటారు. ఈ కొరియన్ బ్యాండ్ 2010లో స్థాపించగా 2013లో బిగ్ హిట్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఆరంగేట్రం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తమ పాటలతో ఎనలేని గుర్తింపు సంపాదించారు.
BTS
బీటీఎస్ బాయ్ బ్యాండ్‌లో మెుత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. జిన్, సుగా, జే హోప్, ఆర్ఎం ,జిమిన్, వీ, జంగ్ కుక్ లు సొంతంగా పాటలు రాయటంతో పాటు వాటికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుంటారు.
ఎవరెవరు
ప్రపంచవ్యాప్తంగా బీటీఎస్ బ్యాండ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. భారత్‌లోనూ అభిమానులను సంపాందించింది. 2021లో యూట్యూబ్‌లో కేవలం మన దేశంలోనే 1.52 బిలియన్ వ్యూయర్స్ ను సంపాందించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక ఆల్బమ్‌కు 24 గంటల్లోనే 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
భారత్ లో గుర్తింపు
భారత యువత వివిధ రంగాల్లో రాణించాలనే ఆత్రుతతో ఉంటుంది. బీటీఎస్ బ్యాండ్ అలాంటివారికి ఆదర్శంగా నిలిచింది. ఏడుగురు యువకులు ప్రపంచాన్ని శాసిస్తుంటే తాము ఏదైనా సాధించాలనే కోరికతో ఎక్కువమంది ఆదరించారని భావిస్తుంటారు.
యువతకు ఆదర్శం
ఏడుగురు సభ్యుల బృందం తెరపై ఎలా కనిపిస్తారో బయట కూడా అలాగే ఉంటారు అందుకే వీరికి అభిమానులు ఎక్కువ. BTS ARMY అని పిలుస్తుంటారు. దీని అర్థం యువతకు ఆరాధ్యం అని వచ్చే రీతిలో క్రియేట్ చేశారు.
ఫ్యాన్ బేస్
ఏదీ ఊరికే రాదు..ఒక్కో పాటను రూపొందించటానికి వీరు చాలా కష్టపడతారు. రోజుకు 9 నుంచి 10 గంటలపాటు శ్రమిస్తారు.
ప్రాక్టీస్
వీళ్లు ఫ్యాషన్ ప్రియులను కూడా మెప్పించారు. ఆల్బమ్స్ లు వివిధ రకాల గెటప్స్ తో ఫ్యాషన్ లోనూ ట్రెండ్ కు తగ్గట్లుగా ఉండటంతో అభిమానులు పెరిగారు
ఫ్యాషన్
బీటీఎస్ బ్యాండ్ సాహిత్యం కూడా వారికి ఫ్యాన్స్ పెరగటానికి ఓ కారణం. సోమరితనం, బాధ్యతరాహిత్యం వంటివి యువతపై ప్రభావాన్ని చూపుతాయో చెప్పడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభ గొప్పవారిని చేస్తుందనే రీతిలో చేసిన రచనలు ఆకట్టుకుంటున్నాయి.
లిరిక్స్
2018లో కొరియా పర్యటనలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అక్కడి సంస్కృతి, కళలను కొనియాడారు. గంగ్నమ్ స్టైల్ నుంచి బీటీఎస్ బ్యాండ్ వరకు వచ్చిన కొరియన్ సంగీతానికి భారత యువత ముగ్దులయ్యారని చెప్పారంటే ఎంతలా మనల్ని ఆకట్టుకుందో చెప్పవచ్చు.
రామ్ నాథ్ కోవింద్ ప్రశంసలు
1. ఫేక్ లవ్ : ప్రేమలో మోసాన్ని చవిచూసి విఫలమైన తర్వాత ఎలా ముందుకు వెళ్లాలనే కోణంలో తీర్చిదిద్దిన ఈ పాట ప్రేక్షకులను అలరించింది. 934 మిలియన్ వ్యూస్ సంపాదించింది.
2. ఐ నీడ్ యూ : 2015లో విడుదలైన ఈ పాట కొరియన్ పాప్ లో 80 అత్యుత్తమ పాటల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాటల్లో అప్పుడు మూడోస్థానంలో నిలిచింది.