Red Section Separator

వాలెంటైన్స్ వీక్ ఎందుకు జరుపుకుంటారు..?

YouSay Short News App

Cream Section Separator

ఫిబ్రవరి వచ్చిందంటే చాలు.. యువతరానికి గుర్తొచ్చే ఫస్ట్ డేట్ ఫిబ్రవరి 14. కొందరు తనకు నచ్చిన వ్యక్తికి ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే.. మరికొందరు మనసుకి దగ్గరైన ప్రేమికురాలికి ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలని థింక్ చేస్తుంటారు.

Cream Section Separator

వారం రోజుల ముందు నుంచే రోజ్ డే నుంచి కిస్ డే వరకు ప్రతిరోజు పండగ చేసుకుంటారు. ఇంతకి ఈ వాలెంటైన్స్ వీక్‌లో ఏ రోజును ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా..? తెలియకుంటే వెంటనే ఓ లుక్కేయండి.

వాలెంటైన్స్ వీక్ ప్రతి ఏడాది రోజ్ డే‌తో స్టార్ట్ అవుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను ఎర్ర గులాబీలు ఇచ్చి రోజ్ డేన వ్యక్తపరుస్తారు. చాలామంది ప్రేమికులు ఎర్ర గులాబీలు ఇచ్చి మనసులోని మాటను వెల్లబుచ్చుతారు. కొందరు ఎల్లో రోజ్ ఇచ్చి తమ స్నేహాన్ని తెలియపరుస్తారు.

రోజ్ డే - ఫిబ్రవరి 7

ఎదుటి వ్యక్తిపై ఇష్టం ఉన్నా లేదా ఇష్టమైన వ్యక్తికి తమ ప్రేమను వెల్లబుచ్చే రెండో రోజే ప్రపోజ్ డే. ఈరోజునే చాలా మంది మదిలో గూడుకట్టుకున్న ప్రేమ అనే అక్షరాలను మనసుకు నచ్చిన వ్యక్తి ముందు సాక్షత్కరింపజేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొ పద్ధతిలో తమ లవర్‌కి ప్రపోజ్ చేస్తారు.

ప్రపోజ్ డే - ఫిబ్రవరి 8

గతంలో జరిగిన చేదు జ్ఞాప‌కాలను మరిచి జీవితాన్ని మధుర క్షణాలతో ప్రారంభించడానికి మూడో రోజు చాకొలెట్ డే నిర్వహిస్తారు. చాలామంది ఇదే రోజు తమ ఇష్టమైన వారికి చాకొలెట్‌లను గిఫ్టులుగా ఇచ్చి ఇష్టమైన వారిని ఆకట్టుకుంటారు.

చాకొలెట్ డే - ఫిబ్రవరి 9

అందమైన టెడ్డీ మనం ఇష్టపడే వ్యక్తి ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని అందిస్తుందనే ఉద్దేశంతో టెడ్డీ డే నిర్వహిస్తారు. ఈ టెడ్డీ పక్కన ఉంటే మనం ప్రేమించిన వ్యక్తి మన పక్కనే ఉన్నాడని కూడ కొంతమంది ఫీలవుతారు. అందుకే యువకులు ఎక్కువగా ఇష్టమైన వారికి వీటిని కొనిస్తూ ఉంటారు.

టెడ్డీ డే - ఫిబ్రవరి 10

జీవితాంతం ఒక్కరి కోసం ఒకరం కలిసి ఉంటామని హామీ ఇచ్చే రోజును ప్రామిస్ డే‌గా జరుపుకుంటాం. కష్టసుఖాల్లో కూడ కలకాలం తోడుండాలనే కాన్సెప్ట్‌తో లవర్స్ ఈరోజు చాలా ప్రామిసెస్ చేసుకుంటారు. బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈరోజును సెంటిమెంట్‌గా భావిస్తుంటారు.

ప్రామిస్ డే - ఫిబ్రవరి 11

మనసులోని భావాలను కొన్ని సందర్భాల్లో వ్యక్తపరచలేనప్పుడు.. ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకుంటారు. అప్పుడు తన మనసులోని భావన ఎదుటి వ్యక్తికి తెలుస్తుందని భావిస్తుంటారు. అందుకే చాలా మంది హగ్ డే రోజున తమలో గూడుకట్టుకున్న ఎమోషన్స్ అండ్ లవ్‌ని హగ్స్ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు.

హగ్ డే - ఫిబ్రవరి 12

వాలెంటైన్స్ డేకి ఒకరోజు ముందున కిస్ డే జరుపుకుంటారు. ముద్దు ద్వారా మనసులోని లవ్‌ని లవర్స్ ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. వాలెంటెన్స్ డేలో చివరి రోజు కాబట్టి చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నద్ధమవుతుంటారు.

కిస్ డే - ఫిబ్రవరి 13

వాలెంటైన్ అనే ఒక క్రిస్టియన్ ప్రవక్త త్యాగానికి ప్రతిఫలంగా ఈరోజును నిర్వహిస్తారు. క్రీ.శ.270లో రోమ్ చక్రవర్తి క్లాడియస్ యువకులు ఎవరు పెళ్లి చేసుకోరాదని చట్టాన్ని తీసుకొచ్చాడు.

వాలెంటైన్ డే - ఫిబ్రవరి 14