ధమాకా చిత్రం శ్రీ లీలను  టాప్‌ హీరోయిన్‌గా చేస్తుందా?

YouSay short News App

శ్రీలీల నేటితరం హీరోయిన్లలో అందరికన్నా ఎక్కువ పాపులరై చేతినిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది.

పెళ్లి సందడి సినిమాతో ఆరంగేట్రం చేసిన  ఈ ముద్దుగుమ్మ..తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించింది.

కుర్ర హీరోల పక్కన ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. రానున్న చిత్రాలన్నీ రెండు, మూడోతరం హీరోలతోనే ఉన్నాయి.

సందీప్‌ కిషన్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కార్తీకేయతో నటించే ప్రాజెక్టులకు  సంతకం చేసేసింది.

రవితేజ సరసన నటించిన ధమాకా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పాటలతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ధమాకా చిత్రం శ్రీలల కెరీర్‌కు కీలకం. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే హిట్ కావటం తప్పనిసరి.

ఒకవేళ బాక్సాఫీస్ వద్ద ధమాకా బ్లాక్ బస్టర్‌ కొడితే శ్రీలీలకు ఇండస్ట్రీ ద్వారాలు పూర్తిగా తెరుచుకుంటాయి. టాప్‌ హీరోల సరసన నటించే అవకాశం దక్కుతుంది.

జనాన్ని థియేటర్లకు రప్పించేందుకు శ్రీలలతో పాటు ధమాకా చిత్రబృందం ప్రమోషన్లతో గట్టిగానే ప్రయత్నిస్తున్నారు

ధమాకా చిత్ర ప్రమోషన్లలో భాగంగా శ్రీలల చాలా ఇంటర్వ్యూలకు వెళ్లారు. ఎన్నో టీవీ షో కార్యక్రమాలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేశారు.

మరోవైపు హీరో రవితేజకు కూడా చాలాకాలంగా మంచి హిట్ లేదు. ధమాకా సక్సెస్‌ అతడికి కూడా చాలా అవసరం.

రవితేజ, శ్రీలీలతో పాటు చిత్రబృందం మెుత్తం ధమాకా హిట్‌ కొడుతుందనే విశ్వాసంతో ఉన్నారు. వారి ఆశ నిజం కావాలని కోరుకుందాం.

డిసెంబర్ 23న వీరిద్దరూ నటించిన సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.