WOMEN DAY SPECIAL : తెలుగులో పవర్ ప్యాక్‌డ్ లెడీ క్యారెక్టర్స్.. వీటిని మించి ఉన్నాయా?
YouSay Short News App
తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి.
పాజిటివ్, నెగటివ్ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు హీరోయిన్లు. కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేయండి.
అరుంధతి
కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది.
మహా నటి
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహా నటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు.
కర్తవ్యం
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది.
ధర్మ యోగి
హీరోయిన్ త్రిషను విలన్ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం.
శివగామి
బాహుబలిలో ప్రభాస్ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు.
అత్తారింటికీ దారేది
పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.
ఓసేయ్ రాములమ్మ
ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది.
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.
చంద్రముఖి
చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.