WPL: స్మృతి మంధానకు ఎందుకంత క్రేజ్… అంత ధర అవసరమా?

YouSay Short News App

టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ వేలంలో అత్యధిక ధర పలికింది.

రూ.50 లక్షల కనీస ధరతో స్మృతి మంధాన వేలంలో పాల్గొంది

ముంబై, బెంగళూరు జట్లు స్మృతిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీ పడ్డాయి చివరకు రూ. 3 కోట్ల 40 లక్షలకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంది.

నిలకడైన ఆటతీరు, నాయకత్వ ప్రతిభ, బ్రాండ్స్‌ మార్కెటింగ్‌ కోసం ఒక ప్రచారకర్తకు ఉండాల్సిన ఉన్న అన్ని లక్షణాలు స్మృతి సొంతం

స్మృతికి క్రేజ్ ఎందుకు?

టీ20ల్లో స్మృతి మంధానకు అత్యుత్తమ బ్యాటర్‌గా పేరుంది. ఇప్పటి వరకు 112 టీ-20 మ్యాచ్‌లు ఆడింది.

టీ20ల్లో 27.32 సగటుతో 2651 పరుగులు చేసింది. వీటిలో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో అత్యధిక స్ట్రైక్ రేటు 123.13 స్మృతి పేరిట ఉంది.

వన్డేల్లో 77 మ్యాచ్‌లు ఆడిన స్మృతి 3073 రన్స్ చేసింది. వీటిలో ఐదు సెంచరీలు ఉన్నాయి.

భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు మాత్రం ఆశించిన ధర దక్కలేదు. నాలుగు టీమ్‌లు హర్మన్‌ కోసం  పోటీ పడినా చివరకు రూ. 1. 80 కోట్ల వద్దే ఆమె వేలం ముగిసింది.

Wpl వేలంలో  అత్యధిక ధర పలికిన టాప్‌–10 జాబితాలో భారత్‌ నుంచి స్మృతి మంధానతో పాటు

టాప్‌ -10 జాబితా

దీప్తి శర్మ              (రూ.2 కోట్ల 60 లక్షలు), జెమీమా రోడ్రిగ్స్‌        (రూ. 2 కోట్ల 20 లక్షలు), షఫాలీ వర్మ            (రూ. 2 కోట్లు), పూజ వస్త్రకర్‌           (రూ.1 కోటి 90 లక్షలు), రిచా ఘోష్‌             (రూ. 1 కోటి 90 లక్షలు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రూ. 1 కోటి 80 లక్షలు) ఉన్నారు.