పెద్ద సినిమాలకు ‘రైటర్ పద్మభూషణ్’ గుణపాఠం.. సినిమా సక్సెస్‌కు ఇది చాలు..

YouSay Short News App

సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ బాక్సాఫీస్ వద్ద 10రోజుల్లోనే రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మరో మైలురాయిని చేరుకుంది.

సరైన కంటెంట్ ఉంటే చాలు.. ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘రైటర్ పద్మభూషణ్’ మరోసారి నిరూపించింది.

కంటెంట్ చాలు..

తమలోని ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి నూతన క్యాస్ట్ అండ్ క్రూకి ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ మానసిక స్థైర్యాన్ని రగిలించి, స్ఫూర్తిగా నిలిచింది.

స్ఫూర్తిగా..

‘రైటర్ పద్మభూషణ్’లో పెద్ద స్టార్లు లేరు. పేరొందిన టెక్నిషియన్లూ లేరు. తమ పాత్రలకు న్యాయం చేస్తే ఎంతటి వారైనా మెరుగ్గా రాణించగలరని  ఈ సినిమా తెలిపింది.

స్టార్లు లేకపోయినా..

మూస ధోరణిలో కాకుండా భిన్నంగా వస్తున్న సినిమాల్ని ప్రజలు ఆదరిస్తున్నారు. కథ నడిపించిన విధానం, సినిమా ముఖ్య ఉద్దేశం ప్రేక్షకుడికి కనెక్ట్ కావడమే ఇందుకు నిదర్శనం. ‘రైటర్ పద్మభూషణ్’ కూడా ఈ కోవలోకే వస్తుంది.

కాన్సెప్ట్ ముఖ్యం

సినిమా హీరో కచ్చితంగా అందగాడై ఉండాలనేది పాత నిబంధన. సరిగ్గా నటిస్తే చాలని సుహాస్ నిరూపించాడు. అందంగా లేరని రిజెక్ట్ చేసే చాలామంది దర్శకనిర్మాతలకు కనువిప్పు కలిగేలా చేశాడు. తన నటనతో సుహాస్ సినిమాను నడిపించాడు. గత చిత్రం కలర్‌ఫోటోలోనూ మెప్పించాడు.

నటనకే ప్రాధాన్యం

టైర్-2 హీరోల సినిమాలకు థియేటర్ల వద్ద పెద్దగా క్రేజ్ ఉండకపోవచ్చు. కానీ, టాలెంట్ ఉన్న ఏ హీరో సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని సుహాస్ సినిమా చాటి చెప్పింది.

థియేటర్లకూ

సినిమాలో  క్లైమాక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. సినిమాను ఎలా నడిపించినా చివరకు క్లైమాక్స్‌లో ప్రేక్షకుడిని మెప్పించాలి. చక్కని క్లైమాక్స్ ప్లాన్ చేయడంతో ‘రైటర్ పద్మభూషణ్’ సక్సెస్ అయింది.

క్లైమాక్స్ కీలకం

సినిమా నిర్మాణానికి భారీ బడ్జెట్ అక్కర్లేదు. కథకు పొంతనలేకుండా భారీ నిర్మాణ విలువలతో తీసిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ క్రమంలో ‘లో బడ్జెట్‌’లో వచ్చిన సినిమాలు అధిక లాభాలు సాధించాయి.

లో బడ్జెట్.. హై ప్రాఫిట్

ఏ సినిమాకైనా ప్రమోషన్స్ చాలా అవసరం.  ఈ సూత్రాన్ని ‘రైటర్ పద్మభూషణ్’ టీం తు.చ. తప్పకుండా పాటించింది. సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తి కలిగేలా చేసింది.

కీ ప్రమోషన్స్

సరైన మార్కెటింగ్ స్ట్రాటజీని ఉపయోగిస్తే పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా అన్నీ ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించగలవని సుహాస్ సినిమాతో మనకు అర్థమవుతోంది.

పక్కా స్ట్రాటజీ

ప్రమోషన్స్‌తో పాటు ప్రేక్షకుడి అంచనాలను అందుకోవడంలోనూ సినిమా సక్సెస్ కావాల్సి ఉంటుంది. ‘రైటర్ పద్మభూషణ్’ని చిరంజీవి, మహేశ్‌బాబు వంటివారు మెచ్చుకోవడంతో మరింత హైప్ క్రియేట్ అయింది.

మౌత్ టాక్

మహిళలకు ఉచితంగా సినిమాను ప్రదర్శించడమూ సినిమాకు కలిసొచ్చింది. సాధారణంగా థియేటర్లకు రానివారు కూడా సినిమా చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

ఉచిత ప్రదర్శన

కథ, నటీనటుల ప్రదర్శన, టెక్నిషియన్స్ పనితీరు, వ్యూహాత్మక ప్రమోషన్స్ సరిగ్గా ఉంటే ఎంత చిన్న సినిమా అయినా భారీ విజయం సాధించగలదని ‘రైటర్ పద్మభూషణ్’ ఒక ఉదాహరణ నిలిచింది.

చక్కని ఉదాహరణ

పాటలు, ఫైట్లు, ఐటమ్ సాంగ్‌లు.. ఇలా రెగ్యులర్ ఫార్మాట్‌కి విరుద్ధంగా ప్రయత్నిస్తున్న సినిమాలు నేటి తరాన్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఈ జానర్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధిస్తున్నాయి.

ట్రెండ్ మారింది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.