Writer Padmabhushan Review: రైటర్ పద్మభూషణ్‌గా సుహాస్ ప్రేక్షకుడిని మెప్పించాడా?

YouSay Short News App

సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కలర్‌ఫోటో తర్వాత సుహాస్ చేసిన సినిమా కావడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, థియేటర్లలో ప్రేక్షకుడిని మెప్పించిందా? రైటర్ పద్మభూషణ్ జనాలను కన్విన్స్ చేశాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.

పెద్ద రచయిత కావాలనేది భూషణ్(సుహాస్). అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటాడు.  ఈ క్రమంలో ఓ పుసక్తం రాసి.. దానిని ప్రింట్ చేయించడానికి రూ.4లక్షల అప్పు చేస్తాడు.  ఈ పుస్తకానికి సరైన ఆదరణ రాదు. దీంతో అందరితో చదివించడానికి భూషణ్ చాలా కష్టపడుతుంటాడు.

కథేంటి?

ఈ క్రమంలో పద్మభూషణ్ పేరుతో మరో పుసక్తం విడుదలై మంచి ఆదరణను పొందుతుంది. కానీ,  ఆ పుస్తకాన్ని తనే రాశానంటూ భూషణ్ చెబుతూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఆ పుస్తకం నచ్చి తన కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ను ఇచ్చి పెళ్లి చేస్తానంటూ మేనమామ ముందుకొస్తాడు.

మరి వీరిద్దరి వివాహం జరిగిందా? తన పేరుతో రచనలు చేస్తున్న వారిని పద్మభూషణ్ గుర్తించాడా? మేనమామకు నిజం తెలిసిపోయిందా? వంటి అంశాలను తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే.

కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా ఇది. మధ్యతరగతి జీవిత విధానాన్ని బాగా చూపించారు. ఎమోషనల్‌గా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో డైరెక్టర్ ఇచ్చిన సందేశం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. మన పక్కింటి కుర్రాడి కథలాగే అనిపిస్తుంది.

ఎలా ఉంది?

పాఠకులతో తన పుస్తకాన్ని చదివించడానికి పద్మభూషణ్ పడే పాట్లు, మరదలితో ప్రేమాయణం వంటి సీన్లతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంటుంది.

సెకండాఫ్‌ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. వచ్చే సరికి సీరియస్‌గా కథ నడుస్తుంది. కొన్ని సీన్లు సాగతీతగా అనిపిస్తాయి. కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులు ముందుగానే ఊహించేలా ఉన్నాయి.

నటుడు సుహాస్ మరోసారి తన నటనతో ఈ సినిమాకు జీవం పోశారు. సినిమా బరువును తన భుజాలపై వేసుకున్నారు. రచయితకుండే హావభావాలను చక్కగా పలికించాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ మెప్పించాడు.

ఎవరెలా చేశారు?

మధ్యతరగతి తండ్రిగా ఆశిశ్ విద్యార్థి మెప్పించాడు. భూషణ్ తల్లి పాత్రలో రోహిణి ఒదిగిపోయారు. తమ నటనతో వీరిద్దరు సినిమాకు బలం తీసుకొచ్చారు. ఇక హీరోయిన్ టీనా శిల్పరాజ్‌ తన పరిధి మేరకు నటించింది.

సాంకేతికంగానూ సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా పనితనం బాగుంది. విజయవాడ, కాకినాడలోని లొకేషన్లను అందంగా చూపించారు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

టెక్నికల్‌గా?

కొత్త పాయింట్‌తో డైరెక్టర్ ప్రశాంత్ కథను అల్లిన తీరు బాగుంటుంది. కానీ, కథనంపై మరింత దృష్టి సారించాల్సి ఉంది. కొన్ని సీన్లు చాలా ల్యాగ్‌గా అనిపిస్తాయి. ఎడిటింగ్ మెరుగ్గా చేస్తే సినిమా మరింత బాగుండేది.

స్లో నరేషన్ మలుపులు ముందే ఊహించడం

బలహీనతలు

సుహాస్ నటన క్లైమాక్స్‌లోని సందేశం నిర్మాణ విలువలు

బలాలు

రేటింగ్: 2/5

ప్రేక్షకుడితో రైటర్ పద్మభూషణ్ కాసేపు కాలక్షేపం చేయిస్తాడు.

ఫైనల్‌గా

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.