WTC FINAL 2023: భారత్ ఫైనల్ చేరాలంటే..?

YouSay Short News App

సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్‌లో 2-0 తేడాతో లీడ్‌లో ఉంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఆసీస్‌పై వరుస విజయాలు సాధించడంతో పాయింట్ల పట్టికలో భారత్ విజయాల శాతం మెరుగైంది.

ఫైనల్ మ్యాచ్‌లో దాదాపు ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఊహించని పరిణామాలు ఎదురైతే తప్ప ఈ రెండు జట్ల మధ్యనే టైటిల్ పోరు సాగనుంది.

టాప్ 2.. వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

విన్ పర్సంటేజ్ రెండో టెస్టుకు ముందు భారత్ 61.66 విజయాల శాతంతో ఉండగా, ఆస్ట్రేలియా 70.83గా ఉండేది. రెండో టెస్టు అనంతరం భారత్ 64.06శాతానికి చేరుకోగా, కంగారు జట్టు 66.67కి పడిపోయింది.

ఒకటి గెలిస్తే చాలు.. ఆసీస్‌తో మిగిలిన రెండు టెస్టుల్లో భారత్ మరొకటి గెలిస్తే చాలు ఫైనల్‌లో దాదాపు చోటు లభించినట్లే. అప్పుడు భారత్ విజయాల శాతం 61.92గా ఉంటుంది.

ఇలా అయితే తిరుగుండదు ఆసీస్‌తో భారత్ మిగిలిన రెండు టెస్టుల్లో గెలిచినా, ఒకదాంట్లో గెలిచి మరొకటి డ్రా చేసుకున్నా నేరుగా అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా లేదా శ్రీలంకతో పోటీ పడాల్సి ఉంటుంది.

రెండిట్లోనూ ఓడిపోతే? ఒకవేళ రెండు టెస్టుల్లో ఓడిపోతే భారత్ విజయాల శాతం తగ్గుతుంది. అప్పుడు శ్రీలంక(53.33*) సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మార్చిలో న్యూజిలాండ్‌తో శ్రీలంక రెండు టెస్టుల సిరీస్‌ని ఆడనుంది.

ఇక్కడ నో ఛాన్స్ కేవలం ఒక్క సంఘటనలో మాత్రమే  భారత్ ఫైనల్ చేరుకునే అవకాశం లేదు. రానున్న రెండు టెస్టులు భారత్ ఓడిపోయినా, డ్రా చేసుకున్నా.. న్యూజిలాండ్‌పై శ్రీలంక కచ్చితంగా రెండు టెస్టులను గెలవాలి.

విన్ పర్సెంటేజ్.. న్యూజిలాండ్‌తో రెండింట్లో గెలిస్తే శ్రీలంక 61.11 విజయాల శాతానికి చేరుకుంటుంది. భారత్ మిగిలిన రెండు టెస్టుల్లో ఓడిపోతే 56.94శాతానికి పడిపోతుంది. రెండు టెస్టులను డ్రా చేసుకుంటే విజయాల శాతం 60.65కి తగ్గుతుంది.

ఒకటి తక్కువైనా.. ఇలా కాకుండా, భారత్ ఒకదాంట్లో గెలిస్తే 61.92తో శ్రీలంక కన్నా మెరుగ్గా ఉంటుంది. శ్రీలంక 1-0 తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచినా 55.55శాతానికి చేరుకుంటుంది. అంటే భారత్ రెండింటిని డ్రా చేసుకుంటే వచ్చే విజయాల శాతం(60.65) కన్నా తక్కువే.

సూపర్ ఫామ్ ప్రస్తుత ఫామ్ ప్రకారం భారత్ కనీసం ఒక టెస్టులో నైనా గెలిచే అవకాశం ఉన్నందున దాదాపుగా ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్‌తో పోరు ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.

జూన్‌లో ఫైనల్ ఈ ఏడాది జూన్ 7 నుంచి 11వరకు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓవల్ ఈ సమరానికి వేదికగా నిలుస్తోంది.

భారత్ రన్నరప్.. తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ న్యూజిలాండ్, భారత్‌ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.