WTC FINAL 2023: భారత్ ఫైనల్ చేరాలంటే..? ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత సీన్‌ ఎలా ఉంది?

YouSay Short News App

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత్ ఘోరంగా ఓడిపోయింది. సిరీస్‌లో 2-1 తేడాతో ఇండియా లీడ్‌లోనే ఉంది. కానీ, ఫైనల్ సమీకరణాలను సంక్లిష్టం చేసుకుంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే నాలుగో మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. మూడో టెస్టులో ఓటమితో విజయాల శాతం మళ్ళీ దిగజారింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఇండియా తలపడాలంటే ఏం జరగాలో ఓ సారి చూద్దాం.

టాప్ 2.. వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

విన్ పర్సంటేజ్ రెండో టెస్టు తర్వాత భారత్ విజయాల శాతం 64.06గా ఉండగా, మూడో టెస్టులో ఓటమి అనంతరం 60.29కి పడిపోయింది. కంగారు జట్టు 66.67 నుంచి 68.52కి మెరుగు పరుచుకుంది.

గెలిస్తే చాలు.. ఆసీస్‌తో మిగిలిన మ్యాచ్‌లో భారత్ గెలిస్తే విజయాల శాతం మెరుగవుతుంది. అప్పుడు ఫైనల్‌లో చోటు లభించినట్లే.

శ్రీలంకపై ఆధారం.. ఆసీస్‌తో భారత్ మిగిలిన టెస్టు మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. లేదంటే శ్రీలంక సమీకరణాలపై ఆధార పడాల్సి ఉంటుంది.

శ్రీలంక గెలిస్తే.. మార్చి రెండో వారంలో న్యూజిలాండ్‌తో శ్రీలంక రెండు టెస్టుల సిరీస్‌ని ఆడనుంది. రెండింట్లోనూ శ్రీలంక గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది.

విన్ పర్సెంటేజ్ న్యూజిలాండ్‌తో రెండింట్లో గెలిస్తే శ్రీలంక విజయాల శాతం 61.11 చేరుకుంటుంది. భారత్ చివరి టెస్టులో గెలిస్తే 62.5 విజయాల శాతంతో శ్రీలంక కన్నా ముందుంటుంది.

డ్రా అయితే.. నాలుగో టెస్టును భారత్ డ్రా చేసుకుంటే భారత్ విజయాల శాతం 58.79కి చేరుకుంటుంది. శ్రీలంక ఒక దాంట్లో గెలిచి, ఒకటి డ్రా చేసుకుంటే 55.5శాతానికి పడిపోతుంది. అంటే శ్రీలంక ఒకటి ఓడిపోయినా, డ్రా చేసుకున్నా భారత్‌కు రూట్ క్లియర్ అవుతుంది.

ఓడినా.. భారత్ ఓడితే విజయాల శాతం 56.94కు చేరుకుంటుంది. శ్రీలంక ఒక దాంట్లో గెలిచి, డ్రా చేసుకున్నా 55.5 కన్నా భారత్ మెరుగ్గానే ఉంటుంది.

అహ్మదాబాద్‌లో.. నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై భారత్ ఫైనల్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.

ఫైనల్‌కు ఆస్ట్రేలియా భారత్‌పై మూడో టెస్టు విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి టెస్టులో ఓడినా ఆస్ట్రేలియాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

జూన్‌లో ఫైనల్ ఈ ఏడాది జూన్ 7 నుంచి 11వరకు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓవల్ ఈ సమరానికి వేదికగా నిలుస్తోంది.

భారత్ రన్నరప్.. తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ న్యూజిలాండ్, భారత్‌ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.