Yakutsk: ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం.. బయటకు వెళ్లాలంటే నాలుగు జతల బట్టలు వేసుకోవాలి మరి.
YouSay Short News App
ప్రపంచంలోనే అత్యంత శీతల నగరంగా పేరుగాంచింది యాకుట్‌స్క్. రష్యాలోని ఈ నగరం ఇప్పుడు కనిష్ఠ ఉష్ణోగ్రతలతో వణికిపోతోంది.
భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా యాకుట్‌స్క్ వాతావరణం ఎప్పుడూ శీతలంగానే ఉంటుంది. వేసవిలో సగటు ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెంటీగ్రేడ్ కాగా, శీతాకాలంలో -43.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కావడం గమనార్హం.
ఎప్పుడూ చల్లగానే
ప్రస్తుతం అక్కడ అత్యధికంగా -62.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గత రెండు దశాబ్దాల రికార్డు బ్రేక్ అయింది. 2002, 1982లో మాత్రమే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
రికార్డ్
అతి శీతల పరిస్థితుల్లో జీవించడం ఇక్కడ ప్రజలు అలవాటు చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం పాటు ఇక్కడ కోల్డ్‌వేవ్ ఉంటుంది.
కోల్డ్‌వేవ్
బయటకు రావాలంటే నాలుగు జతల దుస్తులు ధరించాల్సిందే. చేతి గ్లౌజులు, స్కార్ఫ్, హడ్స్, హ్యాట్స్.. ఇలా అన్నీ రెండు, మూడు జతలు వేసుకుంటారు.
పకడ్బందీగా వస్త్రధారణ
సైబీరియాకు తూర్పు దిశలో మాస్కోకు 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉందీ నగరం. సముద్ర మట్టానికి 450 అడుగుల లోతులో ఉంటుంది. ఇక్కడి జనాభా 3.55లక్షలే.
జనాభా తక్కువే
జనవరి మాసం వస్తే వీళ్లకి ఇక మనశ్శాంతి ఉండదు. ఈ నెలలోనే దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి.
అమ్మో జనవరి
రోడ్లన్నీ మంచుతో కప్పేసి ఉంటాయి. వాటిపై నుంచి వాహనాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తెల్లటి రోడ్లు
చేపలను ఫ్రిజ్‌లో పెట్టరు. బహిరంగంగానే వీటిని అమ్ముతుంటారు. కనిష్ఠ ఉష్ణోగ్రతల వల్ల ఆ చేపలు గడ్డకట్టుకుపోయి గట్టిగా మారుతాయి.
చేపలు
జీసస్ క్రైస్ట్ బాప్టిజాన్ని స్వీకరించిన రోజు
(జనవరి 19)ను స్మరించుకునేందుకు వీరు గడ్డకట్టే నీటిలో పుణ్యస్నానాలు చేయడానికి సాహసిస్తారు.