మృణాల్ ఠాకూర్‌ను

సీతారామం హీరోయిన్

మీరెప్పుడు ఇలా చూసి ఉండరు!

మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నా...‘సీతారామం’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిపోయింది.

మృణాల్ నటించిన ‘సీతారామం’ సినిమా బ్లాక్ బ్లస్టర్ చిత్రంగా నిలిచింది. తొలి రోజు రూ. కోటి కన్నా తక్కువ కలెకన్లు వచ్చినప్పటికీ.. లాంగ్‌ రన్‌లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

‘సీతారామం’ మూవీ కన్నా ముందు హిందీలో జెర్సీ, సూపర్ 30, తుఫాన్ వంటి చిత్రాల్లో మృణాల్ నటించినా అంతగా గుర్తింపు రాలేదు.

‘సీతారామం’ చిత్రంలో సీతామహాలక్ష్మిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సీతారామం మూవీ సక్సెస్ తర్వాత పెద్దఎత్తున అవకాశాలు మృణాల్‌కు వస్తున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో మృణాల్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

సినీ ప్రయాణంలో తాను ఈ స్థాయికి రావడానికి  ఎన్నో కష్టాలు పడ్డానని మృణాల్ చెప్పింది.

తను సినిమాల్లోకి రావడం మొదటి ప్రియుడికి ఇష్టం లేకపోవడంతో అతనితో విడిపోయింది.

20ల్లో ఉండే ప్రేమ వేరని, 30ల్లో ఉండే ప్రేమ వేరని చెప్పేది. దీంతో తన వ్యక్తిగత జీవితంలో ప్రేమపై అంత నమ్మకం లేదని చెప్పుకొచ్చింది.

‘సీతారామం’ మేకర్స్ నిర్మిస్తోన్న మరో కొత్త సినిమాలో దుల్కర్ సల్మాన్‌తో కలసి మృణాల్ మళ్లీ నటిస్తోంది.

ప్రస్తుతం ఎంతోమంది బాలీవుడ్ నటులు, డైరెక్టర్లు మృణాల్‌తో సినిమాలు చేయాలని ఆశపడుతున్నారు.