YouSay Short News App

యంగ్‌ ఇండియన్ క్రెకెటర్స్ గర్ల్‌ఫ్రెండ్స్‌

క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తూ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్న యంగ్‌ క్రికెటర్స్‌…వారి ఆటతోనే గాక వ్యక్తిగత విషయాలతోనూ నెట్టింట వైరల్‌ అవుతున్నారు. శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్ కిషన్‌, రిషభ్‌ పంత్ ఇందుకు ఉదాహరణలు.

ఈ క్రికెటర్ల పేర్లు సోషల్‌ మీడియాలో మార్మోగేందుకు వారి ప్రేమ కహానీలే ప్రధాన కారణం. మరి ప్రస్తుత టీమిండియా యంగ్‌ క్రికెటర్ల గర్ల్‌ఫ్రెండ్స్‌ ఎవరో చూద్దామా

రిషభ్‌ పంత్‌

రిషభ్‌ పంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పేరు ఇషా నేగి. వీరిద్దరూ చాలా కాలంగానే ప్రేమలో ఉన్నా..రహస్యంగానే ఉంచారు. కానీ 2019లో యువ జంట తమ ప్రేమను ప్రపంచానికి చెప్పింది. జనవరిలో ఓ ఫోటోను షేర్ చేసి తమ రిలేషన్‌ను కన్ఫర్మ్‌ చేశారు

ఇషా నేగి

ఉత్తరాఖండ్‌కు ఇషానేగి ఓ ఇంటీరియర్‌ డెకార్‌ డిజైనర్‌. సూపర్‌ మోడల్‌కు ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం. దిల్లీలో చదువు పూర్తిచేసింది. ప్రస్తుతం ముంబయిలో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటోంది.

శుభ్‌మన్‌ గిల్‌

భారత క్రికెట్ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ కుమార్తె సారా తెందూల్కర్‌..యువ క్రికెట్ సంచలనం శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉందని ఓ ప్రచారం. ఇందులో ఎంత వాస్తముందనేది ఎవరికీ తెలియదు గానీ, శుభ్‌మన్ సెంచరీ చేసినా సారా పేరు మార్మోగిపోతోంది.

సారా తెందూల్కర్

సారా తెందూల్కర్ అందానికి ఫిదా అయ్యే కుర్రకారు చాలామందే ఉన్నారు. Ajio LUXE ద్వారా సారా తన మోడలింగ్‌ ఆరంగేట్రం చేసింది. బాలివుడ్‌లో అడుగుపెడుతుందని చాలా వార్తలు వచ్చాయి గానీ, అవన్నీ వాస్తవం కాదని కొట్టిపారేసింది.

ఇషాన్ కిషన్‌

ఇషాన్‌ కిషన్‌ కూడా మోడల్‌ అదితి హుండియాతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా చాలానే వైరల్‌ అయ్యాయి. అయితే ఇవన్నీ రూమర్లుగానే ఉన్నాయి. వీరు ఇప్పటికీ వారి ప్రేమను ధ్రువీకరించలేదు.

అదితి హుండియా

అదితి హుండియా రాజస్థాన్‌కు చెందిన సూపర్ మోడల్‌. 2017లో FBB కలర్స్‌ ఫెమినా మిస్‌ ఇండియా రాజస్థాన్‌ టైటిల్‌ గెలుచుకుంది. తనకు బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ కూడా ఉంది.

పృథ్వీ షా

ఈ మధ్యే టీమిండియాలోకి పునరాగమనం చేసి సత్తా చాటిన పృథ్వీ షా. చాలాకాలంగా జట్టులో చోటు కోసం పోరాడుతున్నాడు. అయితే 23 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పటికే రెండు లవ్‌ స్టోరీలతో పాపులర్ అయ్యాడు. ఒకరు నటి ప్రాచి సింగ్‌, మరొకరు మోడల్ నిధి తపాడియా.

ప్రాచి సింగ్‌

ఉడాన్‌ సీరియల్ ద్వారా పాపులర్‌ అయిన నటి ప్రాచి సింగ్‌. వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఎప్పుడూ మాట్లాడకపోయినా.. సోషల్‌ మీడియాలో వార్తలు గట్టిగానే వైరల్ అయ్యాయి. ఈమె ఇటీవలే వేరే వ్యక్తితో తన పెళ్లి వార్తను ప్రకటించింది.

నిధి తపాడియా

పృథ్వి షా ప్రస్తుతం నిధి తపాడియాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి  ఈ యేడాది నూతన సంవత్సర వేడుకలు కూడా చేసుకున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలకు బలం చేకూరుతోంది.

సఖిని సతీమణిని చేసుకున్న క్రికెటర్లు

కొందరు యంగ్‌ స్టార్లు చాలాకాలం డేటింగ్ రూమర్లు, ప్రేమ వార్తల తర్వాత తమ ప్రేయసిని పెళ్లి చేసుకున్నారు. అందులో రాహుల్- అతియా, రాహుల్ చాహర్-ఇషాని, అక్షర్ పటేల్‌-మెహా పటేల్ ఇలా చాలామందే ఉన్నారు.

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి