వరల్డ్ కప్‌లో సెమీస్‌లో వెనుదిరిగిన రెండు జట్ల మధ్య జరిగిన టీ20లో టీమిండియా కుర్రాళ్లు చెలరేగడంతో భారత్ ఘన విజయం సాధించింది.
సూపర్ ఫామ్‌తో ప్రపంచ నంబర్ 1 టీ20 ఆటగాడిగా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ మరోసారి తన సత్తా చాటాడు. అద్భుత శతకంతో అదరగొట్టాడు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా..టీమిండియా ఓపెనర్లు తడబడ్డారు. ముఖ్యంగా సంజూ శాంసన్‌ను కాదని తీసుకున్న రిషభ్ పంత్ 13 బంతుల్లో కేవలం 6 పరుగులు చేసి ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
IPL సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడుతూ పాకెట్ డైనమైట్‌గా పేరుతెచ్చుకున్న ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 36 పరుగులు చేసి సాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.
పాకెట్ డైనమట్ పేలలే
టీమిండియా మిగతా 10 ప్లేయర్లు ఒక ఎత్తైతే సూర్య ఒక్కడే ఒక ఎత్తు. 33 బంతుల్లో అర్ధశతకం చేసిన సూర్య..మరో 16 బంతులు అయ్యేసరికి సెంచరీ పూర్తి చేశాడు.
ఒక్కడేే 10 మందిలా
51 బంతుల్లో 111 పరుగులు చేసిన సూర్య 7 సిక్సులు, 11 ఫోర్లు బాదాడు. 217 స్ట్రయిక్ రేటుతో బౌలర్లకు చుక్కలు చూపెడుతూ బౌండరీల మోత మోగించాడు.
హద్దుల్లేని SKY
ఇంత అద్భుతంగా ఆడిన సూర్యకు ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మాత్రం ఒక్క బంతీ ఆడే అవకాశం దక్కలేదు. ఈ ఓవర్లో టిమ్ సౌథీ, హార్ధిక్, హుడా, వాషింగ్టన్ సుందర్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చి హ్యాట్రిక్ సాధించాడు. టీమిండియా 191 పరుగుల భారీ స్కోర్‌తో ముగించింది.
స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భువీ తొలి ఓవర్ రెండో బంతికే ఫిన్ ఆలెన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టకుండా కట్టడి చేశారు.
ఆదిలోనే చెలరేగిన భువీ
7వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో కాస్త మూమెంటమ్ షిఫ్ట్ అయినట్లు కనిపించినా 9 ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ కాన్వేను ఔట్ చేయడంతో మళ్లీ ఆట ఇండియా వైపు తిరిగింది.
కాస్త తిరిగినట్టే తిరిగి
హుడా వేసిన 19వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 126 పరుగులకే కుప్పకూలింది. విలియమ్సన్ 61(52) న్యూజిలాండ్ బ్యాటర్లలో పోరాడినా అది ఏమాత్రం సరిపోలేదు.
19వ ఓవర్లో కుప్పకూలిన బ్లాక్ క్యాప్స్
బౌలింగ్‌కు చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు చెలరేగారు. అర్ష్‌దీప్ సింగ్ మినహా అందరు బౌలర్లు వికెట్లు తీశారు. సిరాజ్ 2, చాహల్ 2, భువీ 1, సుందర్ 1, హుడా 4 వికెట్లు తీశారు.
భారత బౌలర్ల బీభత్సం
సూర్య ఇన్నింగ్స్ అత్యద్భుతమని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొనియాడాడు. అతడు ఆడిన కొన్ని షాట్లు తాను గతంలో ఎప్పుడూ చూడలేదంటూ పొగడ్తలతో ముంచెత్తాడు
సూర్య ఇన్నింగ్స్ అద్భుతం
3 టీ20ల సిరీస్‌లో 65 పరుగులతో మ్యాచ్ గెలిచిన టీమిండియా సిరీస్‌లో 1-0తో పైచేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో టీ20 మంగళవారం నేపియర్‌లో జరగనుంది