పాకిస్థాన్‌పై జింబాబ్వే సంచలన విజయం

Floral Separator

T20WC

టీమిండియాపై చివరి ఓవర్‌ చివరి బంతికి ఓటమి పాలైన పాక్‌, జింబాబ్వేతోనూ అదే రిపీట్‌ చేసింది.

ఛేదనలో పాక్‌కు 20వ ఓవర్లో 11 పరుగులు కావాలి. వసీం జూనియర్‌, నవాజ్ క్రీజులో ఉన్నారు. బ్రాడ్‌ ఇవాన్స్‌ బంతి అందుకున్నాడు.

ఉత్కంఠభరిత చివరి ఓవర్‌

19.1 స్లాట్‌లో పడిన బంతిని నవాజ్‌ బౌండరీ లక్ష్యంగా బాదాడు. ఎర్విన్‌ బౌండరీ దగ్గర బంతిని ఆపగా.. 3 పరుగులు వచ్చాయి.

19.1

మ్యాచ్ హైలెట్స్

19.2 క్రీజులోకి వచ్చిన వసీం జూనియర్‌ బంతిని బౌండరీ దాటించాడు. ఇక పాక్‌ విజయం ఖాయమైందని అంతా అనుకున్నారు.

19.2

19.3 షార్ట్‌ బాల్‌ను బౌలర్‌ పక్కగా ఆడిన వసీం సింగిల్‌ రాబట్టాడు. ఇక 3 బంతుల్లో 3 పరుగులు కావాలి.

19.4 సర్రున దూసుకొచ్చిన షార్ట్‌ బాల్‌ను నవాజ్‌ ఆడలేకపోయాడు. డాట్‌ బాల్‌. 2 బంతుల్లో 3 పరుగులు కావాలి.

19.5 ఈసారి గుడ్‌లెంథ్‌ బాల్‌ను బ్యాటర్‌కు దూరంగా విసిరాడు. లాఫ్డెడ్‌ డ్రైవ్‌ ఆడదామని నవాజ్‌ బంతిని బాదాడు. మిడాఫ్‌లో ఉన్న ఇర్విన్‌ చక్కని క్యాచ్‌ పట్టాడు. చివరి బంతికి 3 పరుగులు కావాలి.

19.6 చివరి బంతికి షాహీన్ అఫ్రీది క్రీజులోకి వచ్చాడు. ఫుల్‌ డెలివరీని లాంగ్‌ఆన్‌కు తరలించాడు. 1 పరుగు తీసి రెండో రన్‌ కోసం పరుగెత్తే లోపే..లాంగాన్‌లో ఉన్న రజా చక్కటి త్రోకు రనౌట్‌ అయ్యాడు.

టీమిండియాతో చివరి ఓవర్ బౌలింగ్‌ వేసిన నవాజ్‌..ఈరోజు కూడా లాస్ట్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేశాడు. పాక్‌ ఓటమికి కారణమయ్యాడు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. షాన్‌ విలియమ్స్‌ 31 పరుగులు చేశాడు.

ఛేదనలో ఓపెనర్లు రిజ్వాన్‌(14), బాబర్‌ అజాం(4) మరోసారి విఫలమయ్యారు. మసూద్‌(44), నవాజ్‌ (22) ఫర్వాలేదనిపించినా విజయతీరానికి చేర్చలేకపోయారు.

వరల్డ్‌ కప్‌లో పాక్‌ వరుసగా రెండో మ్యాచ్‌ ఓడిపోయింది.