వెబ్ వెర్క్స్, డేటా సెంటర్, క్లౌడ్ సేవల సంస్థ హైదరాబాద్‌లో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఓ బిల్డింగ్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీని మొదటి దశ డెలివరీ 2022 నాల్గో త్రైమాసికం నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. దీంతో నగరంలో మొదటి వాణిజ్య డేటా సెంటర్‌గా ఇది నిలవనుంది. ఈ డేటా సెంటర్‌పై కంపెనీ రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందని సమాచారం. 2022 చివరి నాటికి దాదాపు 100 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. (representational image)