• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి కార్డు నాటితే మొక్క!

    పెళ్లి పత్రికల ట్రెండ్ మారుతుంది. ఒక్కొక్కరు ఒక్కో విధానంలో ఆలోచిస్తున్నారు. ఓ వ్యక్తి తన పెళ్లికి కార్డులో పసుపు కుంకుమ పంపాడు. ఆ తర్వాత మరో వ్యక్తి తన పెళ్లి కార్డును ఓ స్టోరీ వీడియోగా తయారుచేశాడు. కాని నిర్మల్ జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి మాత్రం తన పెళ్లికి వినూత్నంగా పర్యావరణ హితంగా కార్డులు తయారు చేయించాడు. పెళ్లి కార్డుపై మొక్కలు నాటడం గురించి తెలియ చెబుతున్నాడు. ఆ పత్రికను నీటిలో గంట సమయం నాటపెడితే తులసి, బంతి, పాలకూర లాంటి ఇతర విత్తనాలు వస్తాయన్నాడు. ఆ తర్వాత ఆ విత్తనాన్ని నాటాలని సూచించాడు. మరోవైపు ఆ కార్డుపై భగత్ సింగ్, శివాజీ, కుమురం భీం, వివేకానంద వంటి ప్రముఖుల చిత్రాలను కూడా వేయించాడు. పర్యావరణంతోపాటు దేశభక్తిని చాటేందుకు ఇలా చేసినట్లు ఆయన చెబుతున్నాడు. అయితే ఆ కార్డులను తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించగా, ఒక్క కార్డుకు రూ.50 ఖర్చు అయినట్లు తెలిపాడు.