దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,745 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా మరో ఆరుగుగు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5,24,636కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,386కి పెరిగాయి. మరో 2,236 మంది డిశ్చార్జ్ కాగా, రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న నమోదైన యాక్టివ్ కేసులు 17,883. నిన్నటితో పోల్చితే ఇవాళ కేసులు స్వల్పంగా పెరిగాయి.