వెస్ట్ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ మనోజ్ తివారీ ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. క్వార్టర్ ఫైనల్‌తో పాటు సెమీ ఫైనల్లోనూ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. సెమీ ఫైనల్లో సెంచరీ చేసిన తర్వాత మనోజ్ తివారీ చేసుకున్న సెలబ్రేషన్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. తన జేబులోంచి ఓ లెటర్‌ను తీసి కెమెరాలకు చూపించాడు. దీంతో అంతా ఆ లెటర్ లో ఏముందా? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ లెటర్‌లో తన భార్య (సుస్మితా రాయ్)కు ఐ లవ్ యూ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ అవుతోంది.