పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజాంను కెప్టెన్సీ నుంచి తప్పించాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షాన్ మసూద్‌ను ఎంపిక చేస్తారని సమాచారం. బాబర్ సారథ్యంలో స్వదేేశంలో జరిగిన ఒక్క సిరీస్‌లోనూ పాక్ గెలవలేదు. ఇటీవల ఇంగ్లాండ్‌తో వైట్ వాష్, న్యూజిలాండ్‌తో ఓటమి కారణంగా తొలగిస్తారని సమాచారం. ఇక టెస్టుల్లో సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్‌గా నియమించే ప్రతిపాదనలు ఉన్నాయట. వన్డే, టీ20, టెస్ట్ మూడు విభాగాలకు ముగ్గురుని ఎంపిక చేయవచ్చని కూడా టాక్.