ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఓ మహిళ తనను తానే తాకట్టు పెట్టుకున్న సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ప్రతాప్‌గఢ్‌కు చెందిన రేణుక లూడో ఆటకు బానిసయ్యింది. భర్త రాజస్థాన్‌లో పనిచేస్తూ పంపిన సొమ్మును పెట్టి ఆడింది. ఆమె అద్దెకు ఉండే యజమానితో తరచూ ఆడుతూ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుంది. ఓ రోజు డబ్బు మెుత్తం పోవటంతో చివరకు తనను తానే తాకట్టు పెట్టింది. అందులోనూ ఓడిపోవటంతో ఆమెను యజమాని తీసుకెళ్లాడు. దీంతో రేణుక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.