రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. అయితే, ఈ ప్రమాదంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. క్రికెటర్లు తమ బాధ్యతలను గుర్తెరిగి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించాలి. ‘వయసు రీత్యా డ్రైవింగ్ చేయాలనే అభిలాష ఉండొచ్చు. ఖరీదైన కార్లలో స్పీడుగా వెళ్లొచ్చు. అయితే, ఇక్కడ తమ బాధ్యతలను మరవొద్దు. జాగ్రత్త పాటించాలి. అవసరమైతే డ్రైవర్లను పెట్టుకోవాలి. నాకూ చిన్నప్పుడు బైక్ ప్రమాదం జరిగింది. అప్పటినుంచి నన్ను బైక్ ముట్టుకోలేదు. మీరే మీ గురించి నిర్ణయం తీసుకోవాలి. పంత్‌ని రక్షించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు’ అని కపిల్ వ్యాఖ్యానించారు.