న్యూజిలాండ్‌పై రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్సుపై టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్సు ఎలా ఉందో గణాంకాలే రుజువు చేస్తున్నాయి. ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూడలేకపోయా. కానీ, ఇన్నింగ్సుని బట్టి చూస్తే సూర్య మరో వీడియో గేమ్ మ్యాచ్ ఆడాడని అర్థమవుతోంది’ అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ నెం.1 బ్యాట్స్‌మన్‌గా చెలామణి అవుతున్నాడు.
SKY ఇన్నింగ్సుపై విరాట్ ఏమన్నాడంటే?

© ANI Photo(FILE)