అండాశయంపై కణితి ఏర్పడటంతో ఇబ్బంది పడుతున్నట్లు అమెరికా మోడల్ హెయిలీ బేబర్ తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను ఆమె షేర్ చేసింది. అందులో నడుము ఉబ్బి ఉండగా.. తాను గర్బవతిని కాదని.. అండాశయంపై ఆపిల్ సైజులో కణితి వచ్చిందని చెప్పింది. ఇది చాలా నొప్పిగా ఉందని..చూడటానికి అసహ్యంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. దీనిని చాలామంది వేరే అర్థం వచ్చేలా…మరికొందరు అర్థం చేసుకునేలా ఊహిస్తారని పేర్కొంది.