తాను చెప్పిందే నిజమైందని ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘నాటు నాటు’ ఆస్కార్ నామినేషన్లను దక్కించుకున్న అనంతరం ఈ పాటకు కచ్చితంగా అవార్డు వస్తుందని రెహమాన్ గతంలో చెప్పారు. నిన్న జరిగిన ఆస్కార్ వేడుకల్లో ‘నాటు నాటు’కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ లభించింది. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌లకు రెహమాన్ శుభాకాంక్షలు తెలిపాడు. ‘నేను చెప్పినట్లుగానే నాటు నాటు పాటకు అవార్డు దక్కింది. మీ ఇద్దరితో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి జయహో’ అని ట్వీట్ చేశాడు. 2009లో రెహమాన్ ఆస్కార్ గెలుచుకున్నాడు.