మంచు తుపాను కారణంగా అమెరికా, కెనడా దేశాలు వణికిపోతున్నాయి. ఈ మంచు తుపానుని బాంబ్ సైక్లోన్ అని అంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే, వాతావరణంలో గాలి పీడనం ఉన్నట్టుండి పడిపోవడంతో.. బలమైన గాలులు వీచే అవకాశం ఉందట. ఇలా చాలా వేగంగా, బలంగా గాలులు వీయడం వల్లే దీన్ని బాంబ్ సైక్లోన్ అని అంటుంటారట. ఇది ఏర్పడిన సమయంలో అధికంగా వర్షాలు కురవడం, చెట్లు, భవనాలను ధ్వంసం చేసేంత స్థాయిలో గాలులు వీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, బాంబ్ సైక్లోన్ వల్ల అమెరికా, కెనడా దేశాల్లో ఇప్పటికే చాలా మంది మరణించారు.