టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన భారత్ బంగ్లాను సమర్థంగా కట్టడి చేయలేక పోయింది. 69 పరుగులకే 6 వికెట్లను పడగొట్టినా.. ఆ తర్వాతి వికెట్ తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బంగ్లా బ్యాటర్లలో మెహిది హసన్ మిరాజ్ అజేయ సెంచరీతో చెలరేగగా.. మహ్మదుల్లా(77) విలువైన ఇన్నింగ్సుని ఆడాడు. వీరిద్దరూ కలిసి 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత్ బౌలర్లలో ఉమ్రాన్, సిరాజ్, సుందర్ ఆకట్టుకున్నారు. సిరాజ్, ఉమ్రాన్ టాప్ ఆర్డర్‌ని కట్టడి చేయగలిగా.. సుందర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ భరతం పట్టాడు. కానీ, చివర్లో చేతులెత్తేయడంతో బంగ్లా 271 పరుగులు చేసింది.
భారత్ టార్గెట్ ఎంతంటే..?

© ANI Photo