రోహిత్ గాయం పరిస్థితి ఏంటో?

© ANI Photo

మంగళవారం వెస్టిిండీస్‌తో జరిగిన మూడో టీ20లో గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రోహిత్ శర్మ గాయంపై స్పందించాడు. ‘ఇప్పుడు బాగానే ఉంది. తర్వాతి మ్యాచ్‌కు ఇంకా టైం ఉంది కాబట్టి కోలుకుంటానని భావిస్తున్నా. మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు. అయితే ఇప్పటికే వెన్ను నొప్పితో బాధపడుతున్న రోహిత్..నడుము కండరాలు పట్టేయడంతోనే ఆటనుంచి వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యబృందం రోహిత్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని బీసీసీఐ అధికారులు తెలిపారు.

Exit mobile version