డైరెక్టర్ శంకర్‌తో రామ్‌చరణ్ ‘RC15’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్పై చరణ్ స్పందించాడు. అభిమానుల్లాగే తాను కూడా వేచి చూస్తున్నానని చెర్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘ఫస్ట్ లుక్ విడుదలపై నేను కూడా చాలా సార్లు శంకర్‌ని అడిగా. కానీ, ఆయన ఓ మార్కెటింగ్ జీనియస్. ఎప్పుడు విడుదల చేయాలనేది బాగా తెలిసిన మనిషి. ఆయన్ని 1992 నుంచి చూస్తున్నాం. ఫస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకరేనని రాజమౌళి గతంలోనే చెప్పారు. ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో అంశాలు నేర్చుకున్నాను’ అని చెర్రీ చెప్పాడు.