బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ఓడిన అనంతరం ఆస్ట్రేలియా మాజీలు పిచ్‌లపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దీంతో నాలుగో టెస్టు జరగబోతున్న అహ్మాదాబాద్ పిచ్‌పై చర్చ జరుగుతోంది. అయితే ఈ పిచ్ కూడా స్పిన్నర్లకే అనుకూలించనుంది. గతంలో ఇక్కడ ఇంగ్లండ్‌తో రెండు సిరీస్‌లు జరగ్గా…మొత్తం 40 వికెట్లలో 35 వికెట్లు అశ్విన్-అక్షర్ పటేల్ తీసుకున్నారు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ కూడా 5/8తో అద్భుత ప్రదర్శన చేశాడు.అయితే ఇటీవల రంజీ మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు ఏకంగా 508 పరుగులు సాధించింది. మరోవైపు గుజరాత్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కూడా 500 చేయలేకపోయింది. క్రీజులో నిలబడగలిగితే ఈ పిచ్‌పై భారీ స్కోరు చేయడం కష్టమేమీ కాదని రైల్వేస్ బ్యాటింగ్ నిరూపించింది.