ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. గతేడాది 83వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 85వ స్థానానికి పడిపోయింది. మొత్తం 199 దేశాలతో హెన్లీ సంస్థ ఈ జాబితాను ప్రకటించింది. కాగా శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సింగపూర్, సౌత్ కొరియాలు సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకుంటున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ, స్పెయిన్ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.