మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ .. ఆచార్య తన మార్కెట్‌ను ఏమాత్రం దెబ్బతీయలేదని, ఆ సినిమా డైరెక్టర్స్ చాయిస్ అని, ఆయన ఎలా చెబితే అలా చేశామని చెప్పారు. గాడ్ ఫాదర్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘రాఘవేంద్ర రావు, కోందడ రామిరెడ్డి మొదలుకుని ప్రతి దర్శకుడితోనూ నేను సినిమాపై చర్చించేవాడిని. నా సూచనలు అందించేవాడిని. సినిమా కంటే ఎవరూ పెద్దవారు కాదు. సినిమా అంటే అందరూ కలిసి చేసే పని. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో తమ ఆలోచనలు పంచుకున్నపుడు..చాలా వరకు విజయమే వస్తుంది’ అని అన్నారు. దీంతో నెటిజన్లు ‘హిట్ అయితే నా ఇన్పుట్స్, ఫ్లాప్ అయితే డైరెక్టర్ మీద తోసెయ్యడం’ ఇది ఎంత వరకు సబబు చిరంజీవి గారూ అని ప్రశ్నిస్తున్నారు.