వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఫిబ్రవరి 15 లోగా కేంద్ర ప్రభుత్వం తన స్పందన తెలపాలని ఆదేశించింది. మేజర్ అయిన భార్యపై బలవంతపు శృంగారానికి పాల్పడిన భర్తకు అత్యాచార అభియోగాల నుంచి రక్షణ కల్పిస్తున్న ఐపీసీ సెక్షన్ 375లోని మినహాయింపులను సవాల్ చేసిన పిటిషన్లపైనా సమాధానం ఇవ్వాలని సూచించింది. వీటిపై మార్చి 21 నుంచి తుది విచారణ చేపట్టనున్నారు.