కరెన్సీ నోట్లపై ఏదైనా పెన్సిల్ లేద్ పెన్‌తో రాస్తే చెల్లవంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని PIB వెల్లడించింది. 2000, 500 సహా అన్నింటిపై ఏం రాసినా బ్యాంకులో చెల్లుతాయని స్పష్టం చేసింది. కానీ, అలా చేయడం వల్ల నోట్ల మన్నిక తగ్గే అవకాశం ఉందట. అందుకే సాధ్యమైనంత వరకు ఏమీ రాయవద్దు. ఈ విషయానికి సంబంధించి ఆర్బీఐ కూడా ఇప్పటికే 2020లోనే మార్గదర్శకాలు జారీ చేసింది.