కుప్పం రోడ్ షోను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? నోటీసులు ఎందుకు ఇస్తున్నారు. 30 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. సొంత ప్రజలను కలిసే అవకాశం ఇవ్వరా? ఎందుకు అనుమతి ఇవ్వరో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వండి. వైసీపీ రాజ్యంగం ఇక్కడ అమలు చేస్తామంటే కుదరదు. ఏం తమాషాలు ఆడుతున్నారా?’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే జీవో నం.1 ప్రకారం రోడ్ షోకు అనుమతి లేదని డీఎస్పీ చంద్రశేఖర్ చంద్రబాబుకు వివరించారు.