వారిని విడిపిస్తే తప్పేంటి?: అసదుద్దీన్‌

© ANI Photo

తెలంగాణ, హైదరాబాద్‌లో మత ఘర్షణలకు బీజేపీ కుట్ర చేసిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ మరోసారి విమర్శించారు. పాతబస్తీలో బీజేపీ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ను ప్రజలు భగ్నం చేశారన్నారు. ఓల్డ్‌ సిటీలో కొంతమంది ఆందోళన చేశారని, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాలామంది ఇళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వారిని విడిపిస్తే తప్పేంటని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరూ రాళ్లు రువ్వలేదని ఆయన గుర్తుచేశారు. బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.

Exit mobile version