దీపావళి నుంచి కొన్ని ఫోన్లలో ‘వాట్సప్’ యాప్ ఇక పనిచేయదు. ఐఫోన్ యూజర్లలో ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 ఉన్న ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ ఫోన్లలో ఇక వాట్సప్ తన సేవలను విరమించుకోనుంది. ఇటు ఆండ్రాయిడ్ 4.1 వెర్షన్ కలిగిన మొబైల్ ఫోన్లలోనూ వాట్సాప్ సపోర్ట్ చేయదు. ఈ ఫోన్లలో అధునాతన సాఫ్ట్ వేర్ లేకపోవడం వల్లే వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌ని నవీకరించుకోవడం లేదా కొత్త ఫోన్ కొనుగోలు చేయడం వల్లే వాట్సప్‌ని తిరిగి ఉపయోగించొచ్చు. పాత వెర్షన్‌తోనే వాట్సప్ ఉపయోగిస్తున్న వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఖాతాను తొలగిస్తామని తెలిపింది.
ఈ ఫోన్లలో వాట్సప్ బంద్

© Envato(representational)