ప్రముఖ మెసెంజెర్ యాప్ వాట్సాప్ బిగ్ అప్డేట్ ఇవ్వనుంది. త్వరలో సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. తన వినియోగదారుల కోసం ఒరిజినల్ క్వాలిటీ ఫొటోలను షేర్ చేసుకునేందుకు సరి కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్లో ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను సెండ్ చేయాలంటే క్వాలిటీ సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ మొబైల్ డేటాను కొంచెం ఎక్కువగా తీసుకుంటుందని సమాచారం. కొన్ని వారాల్లో ఈ ఫీచర్ వాట్సాప్ వినియోగదారులకు అందనుంది.