ఎప్పటికప్పుడు నయా ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే సోషల్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ మరో సరికొత్త సదుపాయం తీసుకురాబోతోంది. ‘డూ నాట్ డిస్టర్బ్’ ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది. ఐఓఎస్ లేటెస్ట్ బేటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్ విడుదలైనట్లు డబ్ల్యుబేటాఇన్ఫో వెల్లడించింది. ఈ మోడ్‌లో ఒకసారి ఏ కాంటాక్టునైనా సెలెక్ట్ చేస్తే మళ్లీ మనం అనుమతించే వరకూ కాల్స్ నుంచి మెసేజ్ నోటిఫికేషన్స్ వరకు ఏవీ రావు. మీటింగ్స్, డ్రైవింగ్, స్లీపింగ్ టైంలో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఐఓఎస్ 15 ఆపై వెర్షన్స్ ఉన్న ఐఫోన్‌ల్లో మాత్రమే ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది.