ఎంతో కాలంగా మల్టీ డివైస్ సపోర్ట్ కోసం ఎదురుచూస్తున్న వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. WhatsApp ఆప్ట్ ఇన్ బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్ కింద ఈ ఫీచర్ iOS వినియోగదారులకు ఈ నెలలో అందుబాటులోకి రానుంది. వచ్చే నెలలో Android యూజర్ల కోసం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో ఎమోజీ reactionsను కూడా రిలీజ్ చేశారు. దీంతో వచ్చిన సందేశాలకు ప్రతిస్పందించడానికి వినియోగదారులకు సులభమైన మార్గాన్ని అందిస్తోంది.