స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ టాక్ షోలో నటి సాయిపల్లవి సందడి చేశారు. తన బాల్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నతనంలో నేనొక అల్లరి పిల్లను. ఒకటో తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి స్టేజ్‌పై డ్యాన్స్ చేశాను. అప్పుడు జుట్టు పొడవుగా కనిపించడం కోసం అమ్మ ఓ చున్నీని నా తలకు కట్టింది. తీరా, డ్యాన్స్ చేస్తున్నప్పుడు అది ఊడిపోయి కిందపడిపోయింది. ఆ క్షణం ఎందుకో బాగా ఇబ్బందిగా అనిపించి స్టేజ్ దిగిపోయి బాగా ఏడ్చేశాను. అమ్మ కూడా బాధపడింది’ అని తెలిపారు.