మూడేళ్ల నిరీక్షణ అనంతరం రోహిత్ శర్మ శతకాన్ని నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో హిట్ మ్యాన్ సెంచరీ బాది విమర్శకుల నోటికి తాళం వేశాడు. సెంచరీ చేయగానే రోహిత్ ఔటయ్యాడు. అనంతరం క్రీజును వదిలి వెళ్తుండగా నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న విరాట్ రోహిత్‌ని పిలిచాడు. హిట్‌మ్యాన్‌కి కోహ్లీ అభినందనలు చెప్పాడు. దీంతో రోహిత్ ఆనందం రెట్టింపైంది. ఇరువరు క్రికెటర్ల అభిమానులు ఈ దృశ్యాలను చూసి ఎంతో మురిసి పోతున్నారు. కోహ్లీ కూడా గతేడాది సెంచరీ చేసి వైఫల్యాలకు చెక్ పెట్టిన సంగతి తెలిసిందే.