పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రేమలో లేనని హీరోయిన్ కృతిసనన్ తెలిపింది. నా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయకముందే ఈ విషయం చెప్పేస్తున్నానంది. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. కాగా గత కొన్ని రోజులుగా ప్రభాస్, కృతి ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా వీరి ప్రేమను కన్ఫామ్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజా పోస్ట్‌తో కృతి వీటన్నింటికీ చెక్ పెట్టింది.