కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఓ ఆర్టీఐ కార్యకర్త సేకరించిన వివరాల ప్రకారం 19 లక్షల ఈవీఎంలు అదృశ్యమయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్కే పాటిల్ పేర్కొన్నారు. BHEL రూపొందించిన 9,64,270, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన 9,29,992 ఈవీఎంలు ఎక్కడికి వెళ్లాయో కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కోరారు.