హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగు నీటిని అందించే ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ జలాశయాల పరిధిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని గత ప్రభుత్వాలు 111G.O ను ఏర్పాటు చేశాయి. ఈ జీవో వల్ల ఈ జలాశయాల పరిధిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో ఈ జలాశయాల పరిధిలో ఉన్న గ్రామాల్లో భూములు విలువ లేకుండా ఉండేవి. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేసింది. దీంతో ఇప్పుడు ఇక్కడ ఎటువంటి నిర్మాణాలకు అనుమతించాలనే చర్చ జోరుగా నడుస్తోంది. మరి దీని మీద మీ కామెంట్??