భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకుల జాబితాను జీక్యూ ఇండియా ప్రకటించింది. ఇందులో టాలీవుడ్ నుంచి ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. కరణ్ జోహార్ రూ.1640 కోట్లతో మెుదటిస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో రాజ్ కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో.. సంజయ్ లీలా భన్సాలీ రూ.940 కోట్లతో మూడో ప్లేస్లో నిలిచారు. తర్వాత వరుసగా అనురాగ్ కశ్యప్ రూ. 720 కోట్లు, కబీర్ ఖాన్ రూ. 300 కోట్లు, రోహిత్ శెట్టి రూ. 280 కోట్లు, రాజమౌళి రూ. 158 కోట్లతో ఉన్నారు.