సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గుజరాత్ హైకోర్టు ప్రధాన మూర్తిగా ఉన్న జస్టిస్ జంషెడ్ బుర్జోర్ పార్దివాలా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పార్దివాలా 2028లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కూడా అయ్యే అవకాశం ఉంది. ఆగష్టు 12 1965లో జన్మించిన ఆయన.. 1994 నుండి 2000 వరకు గుజరాత్ బార్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. 2011లో గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన.. 2013లో ప్రధాన న్యాయమూర్తిగా పర్మినెంట్ చేయబడ్డారు.