సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, వార్తల్లోనూ ఎక్కువగానే నిలుస్తుంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా శ్రీజ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘‘డియర్ 2022.. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కష్ట సుఖాల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకునే, అమితంగా ప్రేమించే, అన్ని విధాలుగా సంరక్షించే ఆ వ్యక్తి మరెవరో కాదు నేనే’ అంటూ పోస్ట్ చేసింది. సెల్ఫ్ లవ్‌పై శ్రీజ చేసిన ఈ పోస్ట్‌కు అనేక మంది స్పందిస్తున్నారు.