హిమాచల్ ప్రదేశ్‌లో హస్తం పార్టీ సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడింది. 40 సీట్ల స్పష్టమైన మెజార్టీ రావటంతో సర్కారు ఏర్పాటు చేయనుంది. ఎమ్మెల్యేలు భాజపా వలలో పడకుండా చండీగఢ్ తరలించాలని చూసినా విరమించుకోవాలని చూస్తోంది. సీఎం అభ్యర్థుల్లో ప్రతిభా సింగ్, సుఖ్విందర్ సింగ్ సుఖు, అగ్నిహోత్రి, కౌల్ సింగ్, ఆశాకుమారి పేర్లు వినిపిస్తున్నాయి. వరుసగా ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టుకుండా వస్తున్న హిమాచల్ ప్రజలు.. భాజపాను గద్దె దింపి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు.