ఫిఫా వరల్డ్‌కప్ క్వార్టర్స్ మ్యాచ్‌లు నేటి నుంచి జరగనున్నాయి. డిసెంబర్ 9న బ్రెజిల్ గత రన్నరప్ క్రొయేషియాతో ఢీకొననుంది. 10న నెదర్లాండ్స్‌తో మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా తలపడనుంది. 11న మొరాకోతో రోనాల్డో సారధ్యంలోని పోర్చుగల్ ఆడనుంది. 12న డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఇంగ్లండ్ పోటీపడనుంది. ఏ జట్టూ దేనికేదీ తీసిపోయేది కాదు కాబట్టి క్వార్టర్స్‌లో హోరాహోరీ పోరాటాలు ఉంటాయి. తమ అద్భుత ఆటతో ఫుట్‌బాల్ లవర్స్‌ను ఆటగాళ్లు ఉర్రూతలూగించనున్నారు.