వీరసింహా రెడ్డి చిత్రంలో బాలయ్య కారును తంతే వెనక్కి వెళ్లే సీన్‌పై వస్తున్న విమర్శల గురించి దర్శకుడు గోపిచంద్ మలినేని స్పందించారు.“ కారులో ఉన్న వాళ్లు రివర్స్ గేర్ వేసి వెనక్కి వెళ్లాలని అనుకుంటారు. కారు వెనుక చక్రం మట్టిలో కూరుకుపోయి ఉంటుంది. బాలకృష్ణగారు డైలాగ్ చెప్పిన తర్వాత కారును తంతారు. దీంతో దిగబడిపోయిన టైరు పైకి లేస్తుంది. అప్పటికే కారు రివర్స్ గేర్‌లో ఉంది కదా? అప్పుడు వెనక్కి వెళ్లకుండా ముందుకా వస్తుందా ? చెప్పండి” అన్నారు.